రాష్ట్రంలో 2013 నుంచి అంతా "జగన్" కాలమే....

WD
జగన్ జనన తేదీ: 21 -12- 1972 పాఢ్యమి గురువారం, ఆరుద్ర నక్షత్రం మిధునరాశి నందు జన్మించారు. వృషభంలో శని మిథునంలో చంద్ర, కేతువులు, వృశ్చికంలో నందు రవి, గురు, రాహువులు ఉండటం వల్ల వీరు చక్కని రూపం కలిగినవారు, ఎదుటివారిని తేలికగా ఆకర్షించేవారు, విజ్ఞానవంతులు, ఎవరి సహాయం అయినా పొందినా వారిని మరువకుండా ఉండేవారుగా ఉంటారు.

దయ, మంచితనం, చురుకుతనం, పనియందు ధ్యాస కలిగినవారు, మంచి పట్టుదలతో ధైర్య సాహసాలతో ముందుకు సాగే నాయకుడయ్యే అవకాశాలు కానవస్తున్నాయి. వర్తమానం శని మహర్దశ జరుగుతుంది.

2011 డిసెంబరు వరకూ అర్ధాష్టమ శనిదోషం ఉన్నందువల్ల అవరోధాలు, చికాకులు వంటివి ఎదుర్కొంటారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. 2012 నుంచి జగన్‌కు సత్కాలం ప్రారంభమవుతుందని చెప్పవచ్చు. 2013 నవంబరు నుంచి బుధ మహర్దశ మంచి యోగాన్ని ఇస్తుంది.

వెబ్దునియా పై చదవండి