కొప్పున పువ్వులు పెట్టుకున్నట్లు కలలుగంటున్నారా?

బుధవారం, 16 ఏప్రియల్ 2014 (17:22 IST)
File
FILE
తలలో పువ్వులు పెట్టుకున్నట్లు కల వచ్చినచో అధిక సంతోషం కలుగుతుందని జ్యోతిష్య పండితులు చెపుతున్నారు. అలాగే, పువ్వులు గల చెట్లను కలలో చూసినట్లైతే చేయు పనుల్లో ఆటంకాలు కలుగుతాయని వారి అభిప్రాయంగా ఉంది.

పువ్వులను వాసన చూసినట్లు కల వచ్చినచో స్తీ సౌఖ్యం, స్త్రీ వలన ధనలాభం కలుగుతుందట. పచ్చని కాయలు గల చెట్టును కలలో వస్తే మాత్రం అనుకున్న కార్యములు సకాలంలో పూర్తికావని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.

ఇకపోతే ముత్యాలు, రత్నాలు కలలో కనిపిస్తే.. అష్టైశ్వర్యాలు, శుభఫలితాలుంటాయని, బంగారు వస్తువులను బహుమతిగా వచ్చినట్లు కలగంటే దూరపు బంధువుల నుంచి ఆస్తి సమకూరే అవకాశం ఉంది.

అలాగే బంగారు నాణేలను ఇతరులకు ఇచ్చినట్లు కల వచ్చినట్టయితే స్నేహితులు ఎక్కువవుతారని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. దుకాణంలో వస్తువులు కొనునట్లు గానీ, చూచినట్లుగానీ కలలో కనిపించడం చాలా మంచిది. ఇలా కలగంటే.. ధనలాభము, వస్త్ర లాభం కలుగుతుందని వారు చెపుతున్నారు.

వెబ్దునియా పై చదవండి