నేను వ్యాపారం ఎప్పటి నుంచి ప్రారంభించవచ్చు..

రామకృష్ణ-సుబ్బరెడ్డి పాలెం:
మీరు అమావాస్య సోమవారం వృశ్చికలగ్నం, రోహిణి నక్షత్రం, వృషభరాశి నందు జన్మించారు. రాజ్య, భాగ్యాధిపతులైన రవి, చంద్రులు సప్తమ స్థానం అనగా మీ భార్యస్థానము నందు ఉండటం వల్ల లాభాధిపతి అయిన బుధునితో కలయిక వల్ల మీ భార్య పేరుతో కానీ మీ కుటుంబీకుల పేరుతో కానీ వ్యాపారం చేయండి.

ఎలక్ట్రానిక్స్, ఏజెన్సీ, సంస్థలు, మెటల్, కాంట్రాక్టుకు సంబంధించిన వ్యాపారాలు బాగా కలిసివస్తాయి. సొంతంగా కానీ, భాగస్వామ్యంగా కానీ వ్యాపారం చేసినట్లైతే కలిసివస్తుంది. శ్రీమన్నారాయణుడిని ఆరాధించడం వల్ల మీకు శుభం కలుగుతుంది.

వెబ్దునియా పై చదవండి