ప్రవీణ్‌రెడ్డి గారూ.. మొగలి' చెట్టును నాటండి..

FILE
ప్రవీణ్‌రెడ్డి - పరకాల:

మీరు పాఢ్యమి సోమవారం, తులా లగ్నము, విశాఖ నక్షత్రం, తులారాశి నందు జన్మించారు. గ్రహాలన్నీ రాహు, కేతువుల మధ్య బంధించబడటంవల్ల 'మహాపద్మకాలసర్పదోషం' ఏర్పడటంవల్ల ఈ దోషాలకు శాంతి చేయించండి. స్వదేశంలో మీరు దినదినాభివృద్ధి పొందుతారు.

ధన, భార్యాస్థానాధిపతి అయిన బుధుడు చతుర్థము నందు ఉచ్ఛి చెంది ఉండటంవల్ల 2014 మే నుంచి 2015 మే లోపు వివాహం అవ్వడం, ఆర్ధికాభివృద్ధి, పురోభివృద్ధి పొందుతారు.

2017 వరకు ఏల్నాటి శనిదోషం ఉన్నందువల్ల 3 నెలలకు ఒక శనివారం నాడు శనికి తైలాభిషేకం చేయించి తెల్లని పూలతో శనిని పూజించినా దోషాల తొలగిపోతాయి. ఏదైనా విద్యాసంస్థలలో కానీ, దేవాలయాలలో కానీ, ఖాళీ ప్రదేశాలలో 'మొగలి' చెట్టును నాటినా సంకల్పం సిద్ధిస్తుంది.

గమనిక: మీ ప్రశ్నలను customer.care@ webdunia.net కి పంపండి

వెబ్దునియా పై చదవండి