ఇంటి ద్వారాలు సరిసంఖ్యలో ఉండాలి

ఇంటి ద్వారాలను, కిటికీలను సరిసంఖ్యలోనే అమర్చాలని వాస్తు శాస్త్రజ్ఞులు అంటున్నారు. గృహ నిర్మాణంలో ద్వార అమరిక చాలా ముఖ్యమని వాస్తు శాస్త్రం చెబుతోంది. అందుచేత ఇంటి యజమాని నామరాశిని బట్టి, సింహద్వారం అమర్చడం చాలా మంచిది.

అదేవిధంగా 1, 2, 4, 6, 8, 12, 16 వంటి సరిసంఖ్యలలో ద్వారాలను ఏర్పరుచుకోవడం ద్వారా ఆ గృహంలో సిరిసంపదలు వెల్లి విరుస్తాయని వాస్తు నిపుణులు అంటున్నారు.

ఇందులో ఒక ద్వారం మంచిదే. అయితే సున్నా అంకెలు (10-20-30) పనికిరావు. అదేవిధంగా 3, 5, 7, 9, 11, 13 వంటి బేసి సంఖ్యల్లో ద్వారాలు ఉంచడం మంచిది కాదు. కిటీకీలు, దూలాలు, అలమరలు ఒక దానికి ఒకటి ఎదురెదురుగా ఉండాలి. సింహద్వారానికి రెండు పక్కల కిటీకీలు ఉండాలి. దక్షిణ, పశ్చిమ దిశలలో కిటీకీలు తప్పకుండా ఉండాలని వాస్తు శాస్త్రజ్ఞులు అంటున్నారు.

వెబ్దునియా పై చదవండి