మా ఇంటి చుట్టూ పూల మొక్కలు పెంచుతున్నాం... అలా పెంచుకోవచ్చా...?

శుక్రవారం, 11 ఏప్రియల్ 2014 (17:02 IST)
WD
ఇంట్లో మొక్కలు ఎక్కడ పెంచాలి అనే విషయానికి వాస్తుకి సంబంధం ఉన్నది. నైరుతిలో మొక్కలను పెంచుకుంటే మంచిది. తూర్పుఆగ్నేయం మరియు ఉత్తర వాయువ్యంలో కూడా పూలమొక్కలు పెంచుకోవచ్చు. ఐతే ఇంటి ఫ్లోరింగ్ లెవల్ కంటే గార్డెన్ ఎత్తు తక్కువగా ఉండాలని గమనించండి.

ఈశాన్యంలో ఎట్టి పరిస్థితుల్లో గార్డెన్ ఉండకూడదు. పెద్దపెద్ద చెట్లను తూర్పు, ఉత్తర దిశలలో కాకుండా దక్షిణం మరియు పడమర దిక్కుల్లో పెంచుకోవాలి. ఈశాన్యంలో ఎటువంటి చెట్లు కానీ పెద్ద మొక్కలు కానీ పెంచరాదు.

పూలమొక్కలు లేదంటే పూలకుండీల వరుసల వల్ల ఈశాన్యం తెగిపోకుండా ఉండేట్లు చూసుకోవాలి. ఏ చెట్టయినా మొక్కయినా ఇంటి గుమ్మాలు, కిటికిపారులో పడకుండా చూసుకోవాలి. మొక్కలు పెంపకానికి చిన్నచిన్న నీటిగుంటలు కాని లేదంటే ఫౌంటెయిన్లను గాని నిర్మించుకోవాలి.

అది కూడా ఈశాన్యంలో మాత్రమే నిర్మించాలి. ఇంకా ఏ దిక్కులోనూ నిర్మించకూడదు. ఇవి కూడా గుండ్రంగా కానీ లేదంటే చతురస్రంగా మాత్రమే ఉండాలి. అలాగే వీటి చుట్టూ నిర్మించే అరుగు నేల మట్టానికి సమానంగా కూడా ఉండాలి.

వెబ్దునియా పై చదవండి