భార్యలను భర్తలు వేధిస్తున్నారా?.. ఇంటి వాస్తు దోషం వల్లే...

బుధవారం, 23 ఏప్రియల్ 2014 (17:48 IST)
File
FILE
సాధారణంగా భార్యలను భర్తలు వేధిస్తుంటారు. ఈ బాధ అలాగే కొన్ని దినాల కొద్ది, నెలలకొద్ది సాగుతుంటే మీరు వాస్తు ప్రకారం కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఉత్తర భాగం, తూర్పు ఆగ్నేయ భాగం, దక్షిణ భాగం దోషాలు కలవేమో గమనించండి. ఈ దోషాలను సరి చేసుకుంటే మీ సమస్యలు పరిష్కారమైనట్లే. ఒకవేళ మీ ఇంటికి ఉత్తర వాయువ్యం, తూర్పు ఆగ్నేయం, దక్షిణ నైరుతి వీధిపోట్లు ఏమైనా ఉన్నాయేమో గమనించుకోండి.

అలాగే దక్షిణమును ఎత్తు చేసుకోండి. దక్షిణ భాగం ఖాళీగా ఉంటే అరుగులు కట్టడం లేదా చెట్లు పెంచడం, షెడ్లు వేసి ఎత్తు చేసుకోవడం ద్వారా భార్యాభర్తల మధ్య గొడవలుండవని వాస్తు నిపుణులు అంటున్నారు. ఇక ఉత్తరానికి వస్తే ఇంటియందలి నేలకన్నా పల్లం ఉండే విధంగా చూసుకోండి. వీధిపోట్ల విషయంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాలని వారు సూచిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి