నాగదోష నివారణ!

Shruti AgarwalWD
మీ జాతకంలోని గ్రహ సమ్మేళనాలు మీ అభివృద్ధిని నిరోధిస్తున్నాయా?... అవి మిమ్మల్ని సమస్యల సుడిగుండంలోకి నెడుతున్నాయా?.. లేకుంటే మీకు కీడు చేస్తున్నాయా?.... ఇలాంటి విషయాలపై వ్యాఖ్యానించడం చాలా కష్టమే...ఇదంతా పూర్తిగా అర్ధ రహితమని కొందరు కొట్టి పారేస్తుంటారు.

కానీ 21వ శతాబ్దంలో సైతం ఇటువంటి అంశాలపై విశ్వాసం చూపేవారు వేల సంఖ్యలోనే ఉన్నారు. ప్రజల విశ్వాసాన్ని చూరగొన్న గ్రహ సమ్మేళనాలలో ‘నాగ దోష’ ఒకటి. ‘ఏది నిజ’కు కొనసాగింపుగా, ‘నాగదోష’ తాలూకూ హానికర ప్రభావాల నివారణార్థం వేల సంఖ్యలో భక్తులు విచ్చేసే నాసిక్కు చెందిన త్రయంబక్ గ్రామాన్ని మా తదుపరి గమ్యస్థానంగా ఎంచుకున్నాం.

ఫోటోగ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

తెలతెలవారుతుండగానే నాసిక్ను చేరుకుని, త్రయంబకేశ్వర్కు వెళ్ళేందుకు టాక్సీ కోసం నిరీక్షించసాగాము. మా ప్రయాణంలో పాలుపంచుకునేందుకు టాక్సీ డ్రైవర్ గణపతి అంగీకరించడంతో ప్రయాణం ప్రారంభమైంది. గణపతి ఓ మాటలపుట్ట, ఇంకేముంది మాపై ప్రశ్నలు సంధించడం మొదలుపెట్టాడు. మీ సమస్య ఏమిటి?.. త్రయంబకేశ్వర్కు ఎందుకు వెళ్తున్నారు?.. ‘నారాయణ నాగ బలి’ పూజ ( ‘నాగదోష’ నివారణకై జరిపే ప్రత్యేక పూజ) కోసం మీరు ఇక్కడకు వచ్చారా? అని వరుస ప్రశ్నలు సంధించిన అతను అంతటితో ఆగలేదు.
Shruti AgarwalWD


ఎవరైనా పూజారిని నియోగించుకున్నారా అని మమ్మల్ని అడిగి, మేము లేదని సమాధానం ఇవ్వడంతో, పూజను శాస్త్రోక్తంగా నిర్వహించే పూజారి ఒకరు తనకు తెలుసునని గణపతి మాతో అన్నాడు. అంతేకాక ‘నాగదోష’ నివారణార్ధం ప్రతి సంవత్సరం వేల సంఖ్యలో ప్రజలు త్రయంబకేశ్వరాన్ని సందర్శిస్తారని గణపతి తెలిపాడు. ఎట్టకేలకు త్రయంబకేశ్వరాన్ని చేరుకున్నాము.

చర్చలో పాల్గొనాలని భావిస్తున్నారా? అయితే ఇక్కడ క్లిక్ చేయండి

Shruti AgarwalWD
‘మహామృత్యుంజయ జప’ మరియు ‘శివస్తుతి’ పారాయణంతో అక్కడి వాతావరణం మార్మోగిపోతున్నది. మొదటగా, గోదావరి నదీతీరాన గల ‘కుషవర్ట్ తీర్థ’నికి వెళ్ళాము. ఆ తీర్థంలో ప్రజలు స్నానమాచరిస్తున్నారు. అప్పటికే స్నానం చేసిన కొంత మంది భక్తులు తెలుపు వస్త్రాలను ధరిస్తూ హడావుడిగా ఉన్నారు. వారు ‘నాగదో’ నివారణకై జరిపే ప్రత్యేక పూజకు సిద్ధమవుతున్నారని గణపతి మాతో అన్నాడు.

ఫోటోగ్యాలరీకోసం ఇక్కడ క్లిక్ చేయండి

అక్కడకు వచ్చిన ఒక కుటుంబాన్ని మేము పలకరించాము. ‘దో’ప్రభావంతో తన కుమార్తె శ్వేతకు పెళ్ళి కుదరక అనేక సమస్యలను ఎదుర్కుంటున్నామని కుటుంబ పెద్ద సురేష్ ఖాండే మాతో అన్నారు. ఒక పూజారి సలహా మేరకు తాము ఇక్కడకు వచ్చామని ఆయన తెలిపారు. తమ బంధువుల్లోని ఒకతను ఇలాగే దోష ప్రభావ పీడితులయ్యారని, అయితే ప్రత్యేక పూజలు చేయించడంతో అతని పరిస్థితి కుదుటపడిందని శ్వేత తల్లి మాతో చెప్పారు.

ఖాండే కుటుంబంతో పాటుగా ‘నాగ దో’ నివారణార్ధం అక్కడకు వచ్చిన అనేక మంది ప్రజలను మేము చూసాము. వారిలో అనేకమంది భక్తులు అత్యున్నత అర్హతలు కలవారని తెలిసి ఆశ్చర్యపోయాము. అక్కడే ఉన్న కమలాకర్ అకోల్కర్ అనే పూజారిని మేము కలువగా - ‘రాహువ’, ‘కేతువ’ల మధ్య గ్రహాలు చేరుకున్నప్పుడు ‘నాగదోష’ సంభవిస్తుందని ఆయన మాతో అన్నారు. అటువంటి సమయంలో నాగదోషం బాధితుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని, అంతేకాక ప్రజలు తమ పితృదేవతలకు ‘శ్రద్’ కర్మలను సరిగ్గా నిర్వర్తించనట్లయితే ఈ యోగం కలుగుతుందని పూజారి వివరించారు.
Shruti AgarwalWD


ఇంతలా ప్రజాదరణ పొందిన నాగదోష నివారణ ప్రత్యేక పూజ, విఘ్నేశ్వర ప్రార్ధన మరియు ‘కల’ పూజతో ప్రారంభమవుతుంది. బంగారం మరియు వెండితో తయారు చేసిన తొమ్మిది సర్పాలకు పూజ చేసిన అనంతరం నీళ్ళలో ముంచుతారు. ‘హవన’ కార్యక్రమంతో రెండు గంటల పాటు జరిగే ప్రత్యేక పూజ సమాప్తమవుతుంది. నాగదోషంతో దాదాపు 20% ప్రజల జాతకాలు ప్రభావితమయ్యాయని, తదనుగుణంగా ఈ భక్తులు తమ జీవితంలో పలు ఇక్కట్ల పాలయ్యారని అక్కడకు వచ్చిన భక్తులలో ఒకరైన అకోల్కర్ మాతో అన్నారు.

చర్చలో పాల్గొనాలని భావిస్తున్నారా? అయితే ఇక్కడ క్లిక్ చేయండి.

Shruti AgarwalWD
‘నాగదోష’ బారిన పడిన తన ఖాతాదారైన ప్రదీప్ కుమార్ మరియు అతని భార్య సునందా సేన్ల కోసం ‘నారాయణ నాగ బలి’ పూజను దగ్గరుండి జరిపించే నిమిత్తం అకోల్కర్ ఇక్కడకు వచ్చారు. ఈ సందర్భంగా తమ జీవితం సమస్యల మయమైపోయిందని సునంద మాతో అన్నారు. వైద్యవిద్యను అభ్యసించినప్పటికీ తమ కుమారుడు నిరుద్యోగిగా కాలం గడుపుతున్నాడని ఆమె ఆవేదనగా తెలిపారు. దీనికితోడుగా న్యాయవివాదాలు ఒకవైపు తమను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయని సునంద వాపోయారు. వారు పడే కష్టాలను చూసిన వారి పూజారి, ఇదంతా నాగదోష ప్రభావం కావున తక్షణం త్రయంబకేశ్వర్ వెళ్ళి నివారణ చేయించుకోమని వారికి చెప్పారట.

ఫోటోగ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

పూజా ప్రక్రియను చూసిన అనంతరం గ్రామంలోనికి ప్రయాణమయ్యాం. ఇటువంటి ప్రత్యేక పూజలు జరపడానికి ఆ గ్రామంలో ఇంటికి ఒక పూజారి ఉన్న సంగతిని గమనించాము. వారిలో అత్యధికులు ‘నాగదోష నివార’కు మాత్రమే పూజలు చేస్తారు. కొన్ని గృహాలలో ఏకకాలంలో దాదాపు 20 కుటుంబాలు ప్రత్యేక పూజ చేయడాన్ని వీక్షించాము. ఈ సామూహిక పూజలో ఇద్దరు లేక ముగ్గురు పూజారులు మైక్ ద్వారా గొణుగుతున్నట్లుగా మంత్రోచ్ఛారణ గావిస్తారు. ఈ మొత్తం ప్రక్రియను ఆసాంతం గమనించిన మాకు ఒకటి మాత్రం స్పష్టమైంది. అదేంటంటే, ప్రత్యేక పూజతో బాధితులు ఏమేరకు బాగుపడుతున్నారో తెలియదు కానీ పూజారులకు మాత్రం ప్రతిరోజూ పండగలాగా జీవితాలు గడిచిపోతున్నాయి.

ఈ పూజలో పాల్గొనడం కారణంగా తమకు కొంత ఉపశమనం లభించిందని కొందరు భక్తులు చెప్పగా, కేవలం ఆత్మ సంతృప్తి మాత్రమే ఈ మొత్తం ప్రక్రియ ఉపయోగపడుతుందని మరికొందరు తేల్చిచెప్పారు. పూజతో తమ జాతకానికి పట్టిన అన్ని రకాల ‘దోషాల’ తొలగిపోయాయని వారు విశ్వసిస్తున్నారు. అందుకేనేమో, వారి ముఖాలు ఆనందంతో వెలిగిపోతున్నాయి. నాణానికి మరోవైపు అన్న రీతిలో, ఈ పూజకు సంబంధించిన ఎటువంటి ఆధారాలు పురాతన మతసంబంధిత పుస్తకాలలో మాకు దొరకలేదు. ఆరేడేళ్ళ క్రితం ఇలాంటి భారీస్థాయి పూజలు ఎప్పుడూ జరిగిన దాఖలాలు అంతకన్నా లేవు.
Shruti AgarwalWD


చాలా మంది పూజారులు పూజకు గాను ఖచ్చితమైన ధరను పాటిస్తున్నట్లు తెలుసుకున్నాము. ఇక సమూహంతోపాటుగా దోష నివారణ పూజలో పాల్గొనేవారు, మైకులో పూజారులు ఉచ్ఛరించే మంత్రాలను స్పష్టంగా వినడం చాలా కష్టం. పూజకు సంబంధించిన సకల వ్యవహారాలను పూజారులే చూసుకుంటారు. దోష నివారణార్ధులు కేవలం పూజలో పాల్గొనడానికి మాత్రం వస్తే చాలు. త్రయంబక గ్రామానికి మాత్రమే పరిమితమైన ఈ ప్రత్యేక పూజ అతిపెద్ద వ్యాపారంగా మారిందని తెలుసుకోవడానికి మాకు ఎక్కువ సమయం పట్టలేదు.

చర్చలో పాల్గొనాలని భావిస్తున్నారా?అయితే ఇక్కడ క్లిక్ చేయండి.