కలలు నిజ జీవితం పై ప్రభావం చూపుతాయా...?

శనివారం, 24 ఆగస్టు 2013 (15:58 IST)
FILE
కలలకు జీవితానికి ఏ సంబంధమూ లేదు. వేల, లక్షల కలల్లో ఏదో ఒకటి మాత్రమే అర్థమున్నదై ఉంటుంది. మీ జీవితాన్ని దిశమార్చగల ఆ దర్శనం మీ కలల్లో లభిస్తే, దానికి మీరు అర్థం వెతుక్కుంటూ తిరిగే పరిస్థితి ఎప్పుడూ రాదు. కల పూర్తి అయినా దాని ప్రభావం మాత్రం తప్పక అలాగే నిలిచి ఉంటుంది.

చాలా మందికి కలలో తమకు ఇష్టమైన పనులు చేస్తున్నప్పుడు మెలకువ వచ్చేస్తుంది. తర్వాత వారు కల మధ్యలోనే మెలకువ వచ్చేసిందని బాధపడుతుంటారు. చాలా మంది ఇంతే కలలోనూ తమ గుణం మార్చుకోలేక ఊరికే ఉండిపోతారు. కలల్లో తేలిపోకుండా... నిజ జీవితంలోని తీవ్రతను తెలుసుకోవడానికి ప్రయత్నించండి. నిద్దట్లో వచ్చే పిచ్చి కలల్ని నిర్లక్ష్యం చేయండి. మీ నిద్రనే పోగొట్టే గొప్ప కలల్ని మోస్తూ బతకండి.

మిమ్మల్ని, మీరు బతికున్న ఈ భూమినీ గొప్పగా తీర్చిదిద్దే కలలు కనండి. అలాంటి కలలు లేని బతుకు జీవాధారంలేని జీవమైపోతుంది. కళ్ళల్లో కలలుండవచ్చు. అయితే, కాళ్ళను మాత్రం నిజంలో నిలదొక్కుకోండి. అప్పుడే అమృతాన్ని రుచి చూస్తారు.

వెబ్దునియా పై చదవండి