స్త్రీలు ఉదయాన్నే పూజ చేసేటపుడు గుర్తుంచుకోవాల్సినవి?

శనివారం, 15 మార్చి 2014 (22:20 IST)
WD
ఉదయాన్నే చాలామంది స్త్రీలు పూజ చేస్తుంటారు. ఇలా చేసేటపుడు కొన్ని నియమాలను పాటించాలి...
సకల పూజా ద్రవ్యాలను దక్షిణ భాగము వైపు మాత్రమే ఉంచుకోవాలి. ఇంట్లో చెట్టే కదా అని రేపు మళ్లీ పూలు పూస్తుంది కదా అని చెట్టుకున్న పూలన్నీ కోయరాదు. పూలు లేని చెట్టును ఉదయాన్నే చూడరాదు.

స్టీలు వంటి పళ్లెములలో పూజా ద్రవ్యాలను ఉంచడం, అక్షింతలు కలుపుకోవడం, గౌరీ దేవిని తయారు చేయడం కూడదు. ఒకసారి డబ్బా నిండా అక్షింతలు చేసుకుని అవే వాడకూడదు. ఏరోజు పూలు ఆరోజే వాడినట్లు అక్షింతలు కూడా అంతే.

శుక్రవారం లక్ష్మీదేవి, సరస్వతీదేవి, గణపతి పూజలు ఏమి చేసినా పూజ చేస్తున్నప్పుడు ఆవాహన చేయాలి కానీ, పూజానంతరం ఉద్వాసన చేయకూడదు.

వెబ్దునియా పై చదవండి