నవంబర్ 29 ప్రబోధ ఏకాదశి: తులసిని పూజించండి..!

కార్తీక మాసంలో వచ్చే తొలి ఏకాదశిని ప్రబోధ ఏకదాశి, ఉత్పన్న ఏకాదశి అంటారు. ఈ ఏకాదశి శ్రీ మహావిష్ణువుకు ఎంతో ప్రీతికరమైంది. ఆషాఢ ఏకాదశి (శయనైకాదశి) నాడు శయనించిన స్వామి (యోగనిద్ర) నుంచి ప్రబోధ ఏకాదశి రోజున మేల్కొంటాడని పురాణాలు చెబుతున్నాయి.

అందుచేత ఉత్తిష్ఠోత్తిష్ట గోవింద! త్యజనిద్రాం జగత్పతే, త్వయిస్తుపే జగత్ సుప్తం ఉత్థితే చోత్థితం జగత్" అనే ప్రబోధన మంత్రంతో ప్రార్థనచేసి, శ్రీమహావిష్ణువును అర్చించి, ఉపవాసముంటే విష్ణుమూర్తి అనుగ్రహంతో అనుకున్న కార్యాలు చేకూరుతాయి. అలాగే ఈ రోజున భాగవతంలో "అంబరిషోపాఖ్యానం" చదివినా, విన్నా మేలు జరుగుతుంది

అలాగే కార్తీక శుద్ధ ఏకాదశికి ఎంతో వైశిష్ట్యం కలిగినది. ఈ రోజు శ్రీ మహాలక్ష్మికి వివాహం జరిగిన రోజుగా భావిస్తారు. దీనినే ఉత్థాన ఏకాదశిగా పిలుస్తుంటారు. ఈ ఏకాదశి నాడే దేవదానవులు పాలసముద్రాన్ని చిలికినట్లు పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి ఈ నెల 29 (నవంబర్) మీ ఇంటి ముంగిట ఉన్న తులసికోట వద్ద శ్రీమహావిష్ణువును లక్ష్మీసమానురాలైన తులసిని పూజించడం ద్వారా సుఖసంతోషాలు చేకూరుతాయని పండితులు చెబుతున్నారు.

వెబ్దునియా పై చదవండి