తితిదే పాలక మండలి నిర్లక్ష్యం

తిరుమల గిరులపై వెలసిన శ్రీనివాసునికి పెంపుడు తల్లి వహుళమాత ఆలయం ఏలూరులో ఉంది. అయితే శ్రీవారు మాత్రం నిత్యపూజలు అందుకుంటూ భక్తులు కోర్కెలు తీర్చుతున్నారు. కానీ.. ఆయనను పెంచిన తల్లి ఆలయంలో మాత్రం కనీసం దీపారాధన కూడా కరువైంది.

ఈ ఆలయాన్ని పరిరక్షించాల్సిన తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలి (తితిదే) నిర్లక్ష్యం వహిస్తోంది. దీంతో ఆగ్రహించిన ఆ ప్రాంత వాసులు.. తన తల్లికి జరుగుతున్న అవమానాన్ని శ్రీవారికే విన్నవించుకునేందుకు నిర్ణయించారు. ఇందుకోసం వారు గోవింద మాలలు ధరించి తిరుమలకు బయలుదేరారు.

తొలుత తిరుచానూరులో వెలసిన పద్మావతి శ్రీనివాసుడిని దర్శనం చేసుకుని తిరుమలకు కాలినడక ప్రారంభించారు. ఇదిలావుండగా.. వహుళమాత ఆలయాన్ని అన్ని హంగులు సమకూర్చకుంటే ఆందోళన చేస్తామని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ హెచ్చరించింది.

వెబ్దునియా పై చదవండి