అనంతపురం జిల్లాలోని పుట్టపర్తిని దర్శించుకోండి.

FILE
అనంతపురం జిల్లాలోని ప్రతి వూరూ ప్రతి రాయి దేనిని కదల్చినా రాయలవారి కాలంలోని రతనాల కథలెన్నో చెప్తాయి. అటువంటి అనంతపురం జిల్లాలో పుట్టపర్తి-శ్రీ భగవాన్ సత్యసాయి బాబాగారి ఆశ్రమం చిత్రావతీ నదీతటాన సత్యం, సుందరమై శివంగా నిత్యం భాసించే పుణ్యస్థలిగా సర్వమానవ సమానత్వానికి ప్రతీకగా అంతర్జాతీయతను సంతరించుకున్న శ్రీ సత్యసాయి ఆశ్రమం ప్రశాంతి నిలయానికి ఆలయంగా ఉన్నది.

మంత్రాలయం రోడ్డు స్టేషన్ నుండి రైలు ద్వారా ఆదోని మీదుగా గుంతకల్లు స్టేషనుతో అనంతపురం జిల్లా ప్రవేశించవచ్చు. అయితే శ్రీబాబాగారు వారు ఇహలోకంలో ఉండి, భక్తుల పూజలందుకుంటూ ఆశ్రిత కొంగు బంగారమై భాసించటం ఒక ప్రత్యేకత.

ముఖ్యంగా అక్కడ విశేషంగా శ్రీబాబాగారి జన్మదినం ప్రతి నవంబరు 23వ తేదీన విశేష ప్రాభవముగా జరుగుతుంది.

దసరా, శివరాత్రి, గురుపౌర్ణమి రోజుల్లో భక్తులు దేశవిదేశాల్లోనుండి తండోపతండాలుగా వస్తారు. వుండటానికి కాటేజీలు, ఆహారం సకల సౌకర్యాలు లభిస్తాయి.

వెబ్దునియా పై చదవండి