కలియుగ దైవం శ్రీ షిరిడీ సాయిబాబా

WD PhotoWD
భారతదేశం కనీవినీ రీతిలో మహిమాన్వితమైన శక్తులతో, మానవ రూపం దాల్చిన దైవ స్వరూపంగా భక్తుల పూజలందుకునే అత్యున్నతమైన సాధువుగా శ్రీ సాయి బాబా కొలవబడుతున్నారు (సాయి అనగా సాక్షాత్ ఈశ్వర స్వరూపమని అర్ధం). ఈ నిగూఢమైన ఫకీరు తొలిసారిగా తన దర్శనాన్ని యవ్వన దశలో ఉండగా షిరిడీ గ్రామంలో ఒసంగారు. నాటి నుంచి తన యావత్ జీవిత కాలాన్ని బాబా షిరిడీలోనే గడిపారు.

గత 1918 సంవత్సరంలో సమాధి చెందేంతవరకు తనను ఆశ్రయించిన భక్తులను ప్రేమానురాగాలతో ఆశీర్వదించి, వారి జీవితాల్లో కొత్త వెలుగులు చూపించేవారు. అత్యవసర సమయంలో తనను పిలిచినట్లయితే వెంటనే ఆదుకుంటానని చెప్పడం ద్వారా భక్తుల హృదయాలలో బాబా చిరస్థాయిగా నిలిచిపోయారు.

తరతమ బేధాలు పాటించక అందరికి ఆశీర్వచనాలు అందించడమే తన ధ్యేయంగా బాబా ప్రవచించారు. రోగుల వ్యాధుల నివారణ, జీవితాలను కాపాడుట,
WD PhotoWD
ఆశ్రితులకు రక్షణ, ప్రమాదాలను నివారించుట, ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుట, ప్రజలందరిలో సమైక్య భావనను పాదుకొల్పుట వేయేల తనను ఆశ్రియించిన వారికి ఆధ్యాత్మిక భావనలను కల్పించడం ద్వారా తాను చేసిన ప్రవచనానికి కార్యరూపం ఇచ్చారు.

తన మాటలతో, చర్యలతో సాధకులకు మోక్ష మార్గాన్ని చూపిన ఆధ్యాత్మిక పథ నిర్దేశకుడు సాయిబాబా అని బాబా సమకాలీన భక్తులలో ఒకరైన భక్తుడు చెప్పియున్నారు. భక్తుల పాలిట దైవస్వరూపుడు సాయిబాబా. ఈ సత్యం భక్తుల స్వీయ అనుభవాలతోనే అవగతమవుతుంది. ఊహలకు అతీతమైంది.

WD PhotoWD
దేవాలయ చరిత్
దేవాలయ ప్రాంగణం 200 చ.మీ.ల విస్తీర్ణంలో నిర్మితమైంది. షిరిడీ గ్రామం మధ్యలో కొలువైన దేవాలయం ప్రపంచ స్థాయి పుణ్యక్షేత్రంగా పేరొందింది. శ్రీ సాయిబాబా దర్శనార్దం సగటున ప్రతి దినం 20,000 మంది భక్తులు షిరిడీ గ్రామానికి విచ్చేస్తుంటారు. పండుగ సమయాలలో షిరిడీకి చేరుకునే భక్తుల సంఖ్య ప్రతి రోజూ 1,00,000 పై చిలుకు ఉంటుంది.

1998-99 మధ్య కాలంలో దేవాలయం పునరుద్ధరించబడింది. తదనుగుణంగా దర్శన మార్గం, ప్రసాదం (మధ్యాహ్నం మరియు రాత్రి భోజనం), విరాళాల కౌంటర్లు, ప్రసాదం కౌంటర్లు, క్యాంటిన్, ర్వైల్వే రిజర్వేషన్ కౌంటర్, పుస్తక విక్రయ శాల తదితర సౌకర్యాలు కల్పించబడ్డాయి. అంతేకాక వసతి సదుపాయాలను కూడా
WD PhotoWD
సాయిబాబా సంస్థాన్ కల్పించింది.

చేరుకునే మార్గం:
రోడ్డు ద్వారా: ముంబై (161 కి.మీ.), పూనే (100 కి.మీ), హైదరాబాద్ (360 కి.మీ.), మన్మాడ్ (29), ఔరంగాబాద్ (66), భోపాల్ (277) మరియు బరోడా (202) నుంచి షిరిడీకి నేరుగా బస్సులు కలవు.

రైలు ద్వారా: మధ్య రైల్వే పరిధిలోకి వచ్చే మన్మాడ్-డౌండ్ సెక్షన్‌లోని మన్మాడ్ రైల్వే స్టేషన్, షిరిడీకి అత్యంత సమీపంలో ఉంది. ముంబై, పూనే, న్యూఢిల్లీ, వాస్కో నుంచి మన్మాడ్ రైళ్లు కలవు.

విమానం ద్వారా: ముంబై మరియు పూనే విమానాశ్రయాలు షిరిడీకి సమీపంలో ఉన్నాయి.