ఇకపై 'ప్రత్యేక ప్రవేశ దర్శనం'గా శీఘ్ర దర్శనం: తితిదే ప్రకటన
FILE
కలియుగ వైకుంఠం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్న శీఘ్రదర్శనం పేరును "ప్రత్యేక ప్రవేశ దర్శనం"గా మార్పు చేసినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) బుధవారం ప్రకటించింది. రేపటి నుంచి శీఘ్ర దర్శనాన్ని ప్రత్యేక ప్రవేశ దర్శనంగా పేరు మార్పు చేయనున్నట్లు తితిదే వెల్లడించింది.
శ్రీవారి శీఘ్న దర్శన పథకానికి నేటితో ఏడాది పూర్తైంది. ఈ సందర్భంగా తితిదే విడుదల చేసిన ఓ ప్రకటనలో శీఘ్రదర్శనం ద్వారా ఆలయానికి రూ. 117 కోట్ల ఆదాయం లభిస్తుందని తెలిపింది.
శ్రీవారి శీఘ్రదర్శనం ద్వారా ఏడాది కాలంలో 37లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని తితిదే పేర్కొంది. ఇకపై మంగళ, బుధవారాల్లో కచ్చితంగా లఘ దర్శనాన్ని అమలు చేస్తామని తితిదే అధికారులు ఆ ప్రకటనలో తెలిపారు.