తిరుమల వెంకన్నకు పెరుగుతున్న బంగారం నిల్వలు

బుధవారం, 19 ఆగస్టు 2015 (16:20 IST)
తిరుమల వెంకన్న స్వామికి భక్తులు కానుకలు రూపంలో సమర్పించుకునే బంగారు నిల్వలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. గత ఐదేళ్ళలో ఈ బంగారు నిల్వలు 5350 కేజీలకు చేరుకున్నాయి. వేంకటేశ్వర స్వామికి ప్రతియేటా హుండీ ఆదాయంగా రూ.950 కోట్లు వస్తోంది. అలాగే, బంగారం రూపంలో రూ.250 కోట్లు సమకూరుతోంది. 
 
వాస్తవానికి 2010 సంవత్సరానికి ముందువరకు కూడా శ్రీవారికి భక్తుల సమర్పించిన బంగారు కానుకలను... ముంబైలోని మింట్‌లో కరిగించి... డాలర్లుగా తయారు చేసి విక్రయించేది. ఈ డాలర్ల విక్రయంలో అవకతవకలు చోటుచేసుకోవడంతో వీటిని నిలిపివేసి, బంగారాన్నే బ్యాంకులో డిపాజిట్ చేయడం ప్రారంభించారు. 
 
ఇలా మొదటిసారి 2010 మే 23వ తేదీన 1075 కేజీల బంగారాన్ని టీటీడీ అధికారులు బంయాంకులు డిపాజిట్ చేయగా, 2011లో 1350 కేజీలు ఇలా గత 2010 నుంచి 2014 వరకు మొత్తం 5350 కేజీల బంగారాన్ని బ్యాంకులో టీటీడీ డిపాజిట్ చేసింది. ఈ బంగారానికి కొంత వడ్డీని కూడా టీటీడీ పొందుతోంది. 

వెబ్దునియా పై చదవండి