తితిదే ఆన్‌లైన్‌లో ఉదయం 11 గంటల సమయంలో 54,421 సేవా టిక్కెట్లను విడుదల చేస్తే 10 నిమిషాల్లో ప్రధాన ఆర్జిత సేవా టిక్కెట్లన్నీ హాం ఫట్ అయ్యాయి. టిటిడి అధికారులే ఇది చూసి ఆశ్చర్యపోతున్నారు. ఆన్‌లైన్ సైట్ నుంచి ఎవరైనా డౌన్ లోడ్ చేసుకునే అవకాశం ఉండడంతో రెచ్చిపోతున్నారు దళారీలు.
తితిదే విడుదల చేసిన సేవా టిక్కెట్ల వివరాలను చూస్తే సుప్రభాతం 1,550, అష్టదళపాద పద్మారాధన 120, నిజపాద దర్శనం 800, ఆగష్టు నెలకు సుప్రభాతం 7,956, తోమాలసేవ - 140, అర్చన 140, విశేషపూజ - 1,125, అష్టదళపాదపద్మారాధన - 300, నిజపాద దర్శనం - 1,727, కళ్యాణోత్సవం - 9,750, ఊంజల్ సేవ - 2,600, ఆర్జిత బ్రహ్మోత్సవం - 5,590, వసంతోత్సవం - 10,750, సహస్రదీపాలంకరణ సేవ - 11,875 సేవాటిక్కెట్లను ఆన్‌లైన్‌లో ఉంచారు. సుప్రభాతం, తోమాలసేవ, అర్చన, నిజపాద దర్శనం టిక్కెట్లు 10 నిమిషాల్లోనే ఖాళీ అయ్యాయి. మరి సామాన్య భక్తులకు న్యాయం ఎలా జరుగుతుంది? లక్షకుపైగా టిక్కెట్లు విడుదల చేసిన మొదటి 10నిమిషాల్లో వ్యవధిలోనే ప్రధాన ఆర్జిత సేవా టిక్కెట్లు మొత్తం అయిపోయాయి.