ప్రపంచంలోనే హిందూ ధార్మిక క్షేత్రాల్లో ప్రధానమైన ఆలయం తిరుమల. కలియుగ వైకుంఠుని లీలలు అన్నీఇన్నీ కావు. తిరుమల గిరులలో ఒక్కో రోజు ఒక్కో విధమైన అద్భుతాలు దర్శనమిస్తున్నాయి. తాజాగా తిరుమల నుంచి శాటిలైట్ ద్వారా తీసిన చిత్రంలో ఒక అద్భుతం కనిపించింది. ఆకాశ విహంగం నుంచి తిరుమలను చూస్తే శంఖువు ఆకారం కనిపించింది. దీన్ని చూసిన వారు ఆశ్చర్యానికి లోనయ్యారు.
సాధారణంగా తిరుమల శ్రీవారికి రెండు వైపులా శంఖు, చక్రాలు కనిపిస్తుంటాయి. భక్తులను ఆశీర్వదించేలా ఇవి ఎప్పుడు ఉంటాయి. అలాంటి ప్రాముఖ్యత కలిగిన శంఖు ఆకారం తిరుమల గిరులు కనిపిస్తున్నాయంటే నిజంగా ఇది ఒక అద్భుతమే. ఈ విషయాన్ని తితిదే దృష్టికి కూడా తీసుకెళ్ళారు. రానున్న కాలంలో తిరుమలలో మరెన్ని అద్భుతాలు చూస్తామో...?