క్రీడాకారులకు వీరాభిమానులు ఉండటం మామూలే. వారు కోర్టులో ఆడుతుంటే సరదాగా కామెంట్స్ చేయడం మామూలే. తాజాగా అలనాటి టెన్నిస్ తార స్టెఫీగ్రాఫ్‌ను ఓ అభిమాని పెళ్లి చేసుకుంటావా అని అడిగిన ఓ వీడియోను వింబుల్డన్ అధికారిక ఫేస్‌బుక్ పేజీలో మే 5న పోస్ట్ చేశారు. ఈ వీడియోకు లక్షలాది వ్యూవ్స్ వచ్చాయి. స్టెఫీ సర్వ్ చేస్తుండగా ‘ స్టెఫీ.. నన్ను పెళ్లి చేసుకుంటావా’ అని ఓ వీరాభిమాని అడిగాడు.
దీంతో స్టేడియంలోని ప్రేక్షకులందరూ నవ్వారు. స్టెఫీ కూడా నవ్వకుండా ఉండలేకపోయింది. దీనికి స్టెఫీ తనదైన శైలిలో సమాధానం చెప్పింది. నీ కెంత డబ్బు కావాలి అంటూ సమాధానమిచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. స్టెఫీ తన టెన్నిస్ కెరీర్‌లో 107 సింగిల్స్ టైటిల్స్ నెగ్గింది. నాలుగు ఆస్ట్రేలియన్ ఓపెన్స్, ఆరు ఫ్రెంచ్ ఓపెన్, సెవెన్ వింబుల్డన్, ఐదు యూఎస్ ఓపెన్ టైటిల్స్ ఉన్నాయి.