టీమిండియా బౌలింగ్ మెరుగవుతుంది: కోచ్ గ్యారీ కీర్‌స్టన్

శనివారం, 25 డిశెంబరు 2010 (10:09 IST)
ఈనెల 26వ తేదీ నుంచి డర్బన్‌లో ప్రారంభం కానున్న రెండో టెస్టు మ్యాచ్‌లో భారత బౌలర్ల బౌలింగ్ మెరుగవుతుందని టీమిండియా కోచ్ గ్యారీ కిర్‌స్టన్ అన్నాడు. భారత్-దక్షిణాఫ్రికాల మధ్య జరిగే ఈ రెండో టెస్టులో జహీర్ ఖాన్ రాకతో బౌలింగ్ మెరుగుపడుతుందని కోచ్ హామీ ఇచ్చాడు. తొలి టెస్టులో మహేంద్ర సింగ్ ధోనీ సేన చిత్తుగా ఓడిపోవడంతో, రెండో టెస్టులో సఫారీలపై ధీటుగా రాణించాలని భావిస్తున్నారు.

టీమిండియా బౌలింగ్‌లో సత్తా లేదు. బలహీనంతో పాటు వేగం లేదని సఫారీల కెప్టెన్ గ్రేమ్ స్మిత్ దెప్పిపొడవటంతో ధోనీ సేన ప్రతీకారం తీర్చుకునేందుకు సన్నద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఇంతకుముందు క్లిష్ట పరిస్థితుల్లో 20 వికెట్లు పడగొట్టిన టీమిండియా బౌలర్లు, సఫారీ గడ్డపై ఎందుకు తడబడుతున్నారని ప్రశ్నించారు.

తప్పకుండా టీమ్ ఇండియా బౌలర్లు తమ ఆటతీరును మెరుగుపరుచుకుని మైదానంలో రాణిస్తారని గ్యారీ నమ్మకం వ్యక్తం చేశాడు. సెంచూరియన్ టెస్టులో భారత్ వంద పరుగులు మాత్రమే వెనక్కి తగ్గింది. తొలిటెస్టులో టీమిండియా ఆటగాళ్లు నిలకడగా ఆడాల్సింది. కానీ తొలి టెస్టు కోల్పోవడంతో టీమిండియా ఆటగాళ్లు పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉన్నారని కోచ్ తెలిపాడు.

వెబ్దునియా పై చదవండి