చేయి తీసెయ్: యాషెస్ సిరీస్ చివరి టెస్టులో నాటకీయ పరిణామాలు!

FILE
ఇంగ్లండ్‌తో జరిగిన యాషెస్ సిరీస్ చివరి, ఐదో టెస్టులో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. రెండో ఇన్నింగ్స్‌ను ఆరు వికెట్లకు 111 పరుగుల వద్ద డిక్లేర్ చేసి, 227 పరుగుల విజయలక్ష్యాన్ని తమ ముందు ఉంచిన ఆస్ట్రేలియా కెప్టెన్ మైఖేల్ క్లార్క్ సవాలును ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ స్వీకరించారు.

ఒక దశలో ఈ జట్టు విజయానికి చేరువగా వచ్చింది. చివరి 24 బంతుల్లో 21 పరుగులు చేయాల్సివుండగా, బ్యాడ్‌లైట్ కారణంగా ఆటను నిలిపేసిన ఫీల్డ్ అంపైర్లు అలీం దార్, కుమార ధర్మసేన ఈ టెస్టు డ్రాగా ముగిసినట్టు ప్రకటించారు. అయితే, ఆటను నిలిపివేయడానికి సుమారు గంట ముందే వెలుతురు సరిగ్గా లేదని అంపైర్లకు క్లార్క్ చెప్పాడు. ఒకానొక దశలో ఇంగ్లాండ్‌ను గెలిపించాలన్న ఉద్దేశంతోనే అంపైర్లు ఆటను కొనసాగిస్తున్నారంటూ మండిపడ్డాడు.

ధర్మసేనతో క్లార్క్ వాగ్వాదానికి దిగడంతో అలీం దార్ జోక్యం చేసుకున్నాడు. క్లార్క్‌పై చేయివేసి అతనిని పక్కకు జరిపే ప్రయత్నం చేశాడు. ఈ సంఘటనతో ఆగ్రహించిన క్లార్క్ ‘చేయి తీసేయ్’ అంటూ అలీం దార్‌ను హెచ్చరించాడు.

వెబ్దునియా పై చదవండి