ఒంటేలు వచ్చింది.. పిచ్‌పై పోశారు.. అయితే ఏంటట?: స్వాన్

FILE
పిచ్‌పై మూత్ర విసర్జన చేయడం ద్వారా తాము పాల్పడిన నీతిబాహ్యమైన చర్యకు ఇంగ్లండ్ క్రికెటర్లు ఇసుమంతైనా చింతిస్తున్నట్లు కనిపించట్లేదు.

స్టార్ బ్యాట్స్ మన్ కెవిన్ పీటర్సన్, పేసర్లు జిమ్మీ ఆండర్సన్, స్టూవర్ట్ బ్రాడ్ యాషెస్ సంబరాల్లో తప్పతాగి ఓవల్ మైదానం పిచ్ పై మూత్రం పోయగా, వారి సహచరుడు దిగ్గజ స్పిన్నర్ గ్రేమ్ స్వాన్ వారిని సమర్థిస్తున్నాడు. మూత్రం రావడం అన్నది 'ప్రకృతి పిలుపు' అని, ఆ 'పిలుపు'కు తమవాళ్ళు జవాబిచ్చారని సరికొత్తగా సూత్రీకరించాడు.

మ్యాచ్ ముగిసిన వెంటనే మైదానం మధ్యకు చేరుకుని బీర్లు తాగుతూ, పాటలు పాడుతూ మజా చేసుకున్నామని స్వాన్ వివరించాడు. మూత్రం రావడం, పోయడం అనేది అసహ్యపూరితం కాదని పేర్కొన్నాడు.

అర్థరాత్రి వేళ మైదానమంతా చీకటి ఆవరించి ఉండగా, ఎక్కడ పోస్తున్నామో ఎలా అర్థమవుతుందని తిరిగి ప్రశ్నించాడు. కాగా, ఇంగ్లిష్ క్రికెటర్ల చర్యపై ఈసీబీ విచారణ జరపనుంది.

వెబ్దునియా పై చదవండి