ఐపీఎల్‌ ద్వారా క్రీడా విందును పంచండి : సునీల్ గవాస్కర్

గురువారం, 17 ఏప్రియల్ 2014 (11:52 IST)
File
FILE
దుబాయ్ వేదికగా జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఏడో అంచె పోటీల ద్వారా క్రికెట్ ప్రపంచానికి క్రీడా విందును పంచాలని బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడు సునీల్ గవాస్కర్ ఐపీఎల్ ఫ్రాంఛైజీ క్రికెటర్లకు విజ్ఞప్తి చేశాడు.

ఈ టోర్నీపై గవాస్కర్ మాట్లాడుతూ ఐపీఎల్‌లో ఆటగాళ్లు న్యాయంగా ఆడాలని కోరారు. క్రికెట్‌ను ఆటగా చూడొద్దని ఎంతో మంది క్రికెటర్ల జీవితాలు అందులో మిళితమై ఉన్నాయనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలన్నారు. ఆటగాళ్లు అవాంఛిత కార్యకలాపాలకు దూరంగా ఉండి, న్యాయంగా ఆడాలని హితవు పలికారు.

ముఖ్యంగా.. క్రికెట్ అభిమానులకు పసందైన క్రీడా విందు పంచాలని ఆయన ఆకాంక్షించారు. అభిమానులను కోల్పోతే క్రికెట్ మనుగడ ప్రశ్నార్ధకమవుతుందని, అలాంటి పరిస్థితి రానీయొద్దని గవాస్కర్ స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గవాస్కర్ బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడిగా ఉన్న సంగతి తెలిసిందే.

వెబ్దునియా పై చదవండి