కోహ్లీ మెడలో అనుష్క ఫోటో... షారుఖ్ ఖాన్ కొంటెపని!

గురువారం, 17 ఏప్రియల్ 2014 (12:00 IST)
PR
భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మలు ప్రేమించుకుంటున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఐపీఎల్ ప్రారంభోత్సవ వేడుకల్లో షారుఖ్ ఖాన్, కోహ్లీని ఆటపట్టించాడు. ఈ కార్యక్రమంలో షారుఖ్, కోహ్లికి స్వయంవరం ఏర్పాటు చేశాడు. ఈ స్వయం ద్వారా అనుష్కే తన కలల రాణి అని వెల్లడించేలా చేశాడు.

ఫోటోలతో నిల్చున్న నలుగురమ్మాయిలను చూపించి, అందులో మొదటి ఇద్దరిని, ఆ తర్వాత ఆ ఇద్దరిలో ఒకరిని ఎంచుకోవాలని సూచించాడు. కోహ్లీ ఎంచుకున్న అమ్మాయి చేతిలోని ప్యాకెట్‌లో అనుష్క ఫోటో ఉండడంతో కోహ్లీ సిగ్గుతో మెలికలు తిరిగాడు. షారుఖ్ ఆ ఫోటోను తీసుకుని కోహ్లీ మెడకు తగిలించాడు.

అనంతరం ధోనితో షారుఖ్ సంవాదం కూడా సరదాగా సాగింది. వీరిద్దరు షారుఖ్ ఫేమస్ స్టైల్‌లో ఒక పాటకు పోజిచ్చారు. ధోని హెలికాప్టర్ షాట్ వచ్చాక తన హెలికాప్టర్ ఫోజును ఎవరూ పట్టించుకోవడం లేదని ఖాన్ వ్యాఖ్యానించాడు. ఆ తర్వాత ధోని చేతులు కట్టేసి డ్యాన్స్ చేయమంటే, నావల్ల కాదు అని అని ధోని బదులిచ్చాడు. చెన్నై కెప్టెన్‌ను కుర్చీలోనే కట్టేసి షారుఖ్, దీపికతో కలిసి లుంగీ డ్యాన్స్ పాటకు నర్తించగా, వెనకనే ఉన్న ఇతర జట్ల కెప్టెన్లు పాదం కలిపారు.

వెబ్దునియా పై చదవండి