యువరాజ్‌కు అండగా నిలిచిన కోహ్లీ.. అతనిపై విమర్శలు సరికావు!

శుక్రవారం, 18 ఏప్రియల్ 2014 (16:27 IST)
FILE
శ్రీలంకతో జరిగిన టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో ఓటమికి యువరాజ్ చెత్త బ్యూటింగే కారణమని అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా మాజీలు కూడా యూవీపై విమర్శల వర్షం కురిపించారు. అయితే తాజాగా యువరాజ్‌కు స్టార్ బ్యాట్స్‌మెన్ కోహ్లీ అండగా నిలిచాడు.

టీ20 వరల్డ్ కప్‌లో భారత్ ఓడిపోవడానికి యువరాజ్ ఒక్కడినే వేలెత్తి చూపరాదని, యువరాజ్‌పై ఇటీవల వచ్చిన విమర్శలు సరికావని కోహ్లీ వెనుకేసుకొచ్చాడు. 2007లో టీ20 ప్రపంచకప్, 2011లో ప్రపంచకప్ గెలుచుకోవడంలో యువరాజ్ ముఖ్యపాత్ర పోషించాడని తెలిపారు. తానేంటో నిరూపించుకున్న యువరాజ్ వెంట నిలవాల్సిన అవసరం ఉందన్నాడు.

వెబ్దునియా పై చదవండి