విధ్వంసం సృష్టించిన మాక్స్‌వెల్, మిల్లర్... రాజస్థాన్‌పై పంజాబ్ ఘనవిజయం!

సోమవారం, 21 ఏప్రియల్ 2014 (11:15 IST)
FILE
ఐపీఎల్-7 ఆరంభంలోనే రసవత్తరమైన పోరు జరుగుతోంది. అనూహ్య రీతిలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ విజాయలు నమోదు చేస్తోంది. తన మొదటి మ్యాచ్‌లో చెన్నైకి షాకిచ్చిన పంజాబ్ తాజాగా రాజస్థాన్‌ను చిత్తుచేసింది. సిక్సర్లు, ఫోర్లతో మాక్సెవల్ స్వరవీహరం చేయడంతో పంజాబ్ భారీలక్ష్యాన్ని ఛేధించి విజయం సాధించింది. మరోవైపు మిల్లర్ కూడూ రెచ్చిపోయి ఆడటంతో ఐపీఎల్‌-7లో రెండో విజయం నమోదు చేసింది.

తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 191 పరుగులు సాధించింది. సంజు శాంసన్ 52, షేన్ వాట్సన్ 50, స్మిత్ 27 పరుగులు సాధించి రాజస్థాన్‌కు భారీస్కోరునందించారు. అనంతరం బ్యాటింగ్ దిగిన పంజాబ్ 10 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో చటేశ్వర పుజారాతో మాక్స్‌వెల్ అద్భుత భాగస్వామ్యం నెలకొల్పాడు. ఎటు చూసినా, సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడిన మాక్స్‌వెల్ 126 పరుగుల వద్ద 89పరుగులు చేసి ఔటయ్యాడు.

అప్పటికి విజయానికి 37బంతుల్లో 66 పరుగులు అవసరం. ఈ దశలో క్రీజులోకొచ్చిన మిల్లర్ సిక్సర్ల సునామీ సృష్టించాడు. 51 పరుగులు సాధించి 18.4 ఓవర్లలో మ్యాచ్‌ను ముగించాడు. పంజాబ్ కేవలం 3 వికెట్లుకోల్పోయి విజయం సాధించింది. పూజారా 40 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. మాక్సెవెల్‌కు మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు లభించింది.

వెబ్దునియా పై చదవండి