క్రిస్ లిన్ క్యాచ్‌ను సువర్ణాక్షరాలతో లిఖించొచ్చు!!

శుక్రవారం, 25 ఏప్రియల్ 2014 (14:14 IST)
File
FILE
ఐపీఎల్ ఫ్రాంచైజీ జట్టు కోల్‌కతా నైట్‌రైడర్స్ దశ మార్చిన క్రిస్ లిన్ క్యాచ్‌ను క్రికెట్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించొచ్చని పలువురు క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. ఐపీఎల్ ఏడో అంచె పోటీల్లో భాగంగా షార్జాలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య జరిగిన థ్రిల్లింగ్ మ్యాచ్ చివర్‌లో ఆస్ట్రేలియాకు చెందిన కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆటగాడు క్రిస్ లిన్ బౌండరీ లైన్‌కు వెంట్రుక వాసి దూరంలో పట్టిన క్యాచ్‌తో మ్యాచ్ సీన్ ఒక్కసారిగా మారిపోయి, కేకేఆర్ జట్టు ఓటమి నుంచి తప్పించుకుంది.

ఈ క్యాచ్ పట్ల పలువురు క్రికెటర్లు స్పందిస్తూ.... అతను వెనుకకు దూకుతూ పట్టిన ఆ క్యాచ్ మ్యాచ్‌ను గెలిపించడమే కాకుండా, క్రిస్ లిన్‌కు ఎనలేని పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెడుతుందన్నారు. ఏ ఇద్దరు క్రికెట్ అభిమానులు కలిసినా ఈ క్యాచ్ గురించే చర్చించుకోవడం విశేషం. దీనిపై మాజీ క్రికెటర్లు ప్రశంశల వర్షం కురిపించారు.

వెబ్దునియా పై చదవండి