రెజ్లింగ్‌లోనూ ఫిక్సింగ్ ‌ఉందట: రెజ్లర్ సుశీల్ కుమార్

FILE
భారత్‌ డబుల్‌ ఒలింపిక్‌ రెజ్లింగ్‌ పతక విజేత, మాజీ ప్రపంచ ఛాంపియన్‌ సుశీల్‌ కుమార్‌ చెప్పిన విషయం బట్టి రెజ్లింగ్‌లో కూడా ఇందుకు ఆస్కారం లేకపోలేదని తెలుస్తోంది. 2010లో మాస్కోలో జరిగిన ప్రపంచ రెజ్లింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో తాను ఫైనల్‌కు చేరుకున్నప్పుడు ఇటువంటి ప్రయత్నం జరిగిందని తెలిపాడు.

ఆ టోర్నీలో ఫైనల్‌కు చేరుకుని స్వర్ణ పతకం కోసం సంసిద్ధమవుతున్న సమయంలో భారత శిబిరంలో ఒక వ్యక్తి తన వద్దకు కొంతమందితో కలసి వచ్చాడని, ఫైనల్‌ బౌట్‌లో ఓడిపోతే పెద్ద మొత్తంలో ప్రతిఫలం ముట్టచెబుతారంటూ కొంతమందిని పరిచయం చేశాడని సంచలన ప్రకటన చేశాడు.

ఆ టోర్నీ 66 కిలోల ఫ్రీస్టయిల్‌ విభాగంలో ఫైనల్లో తాను రష్యాకు చెందిన అలాన్‌ గొగాయేవ్‌తో తలపడాల్సి ఉందన్నాడు. తనకు రెండు నుండి నాలుగు కోట్ల రూపాయల మొత్తాన్ని ఇవ్వజూపారని తెలిపాడు.

వెబ్దునియా పై చదవండి