రాజీవ్ గృహకల్పలో దారుణం - ఫ్యామిలీ ఆత్మహత్య

సోమవారం, 17 అక్టోబరు 2022 (11:20 IST)
హైదరాబాద్ నగరంలోని చందానగరులోని రాజీవ్ గృహకల్పలో దారుణం జరిగింది. ఇక్కడ ఉన్న ఓ ఇంటిలో ఏడు సంవత్సరాలుగా నివాసం ఉంటున్న  ఓ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. వీరిలో భార్యాభర్తతో పాటు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. 
 
గత శుక్రవారం నుంచి తలుపులు వేసే ఉన్నాయి. పైగా సోమవారం ఉదయం నుంచి దుర్గంధభరితమైన వాసన రావడంతో అనుమానించిన స్థానికులు పోలీసులకు సమాచారం చేరవేశారు. దీంతో పోలీసులు వచ్చి తలుపు కొట్టారు. ఎంతకీ తలుపులు తీయకపోవడంతో తలుపులు పగులగొట్టి స్థానికులు లోపలికి వెళ్లి చూసి అవాక్కయ్యారు. ఇం
 
ట్లో నాగరాజు, సుజాత దంపతులతో పాటు వారి పిల్లలు రమ్యశ్రీ, టిల్లు విగత జీవులుగా కనిపించారు. కుటుంబ కలహాలే ఆత్మహత్యకు కారణంగా తెలుస్తోంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసకుని దర్యాప్తు ప్రారంభించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు