మంజీరా నది పరివాహక ప్రాంతంలో చిరుత సంచారం

గురువారం, 30 సెప్టెంబరు 2021 (11:07 IST)
మంజీరా నది పరివాహక ప్రాంతంలో ఓ చిరుతపులి సంచరిస్తుంది. నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల సరిహద్దుల్లో ఈ చిరుతపులి కనిపించింది. ఈ రెండు జిల్లాల సరిహద్దు ప్రాంతంలో మంజీరా నది ఉంది. ఇక్కడే చిరుత పులి సంచరిస్తున్నట్టు స్థానికులు గుర్తించారు. 
 
గత 15 రోజుల క్రితం బీర్కుర్ మండలంలో ప్రత్యక్షమైన చిరుత పశువులపై దాడిచేసింది. దీంతో చిరుతపులిని బంధించేందుకు అటవీశాఖ సిబ్బంది బోను ఏర్పాటు చేశారు. 
 
తప్పించుకుని తిరుగుతున్న చిరుత రోజుకో ప్రాంతంలో ప్రత్యక్షమవుతూ ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్నది. తాజాగా బుధవారం రాత్రి మంజీరా నది తీరంలో మరోసారి కనిపించడంతో స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు