తెలంగాణ రాష్ట్రంలో ఆకాశానికి చిల్లుపడిందా అన్నట్టుగా వర్షం కురిసింది. గత 24 గంటల్లో భారీ వర్షం పడింది. ఫలితంగా రికార్డు స్థాయిలో 26.77 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే, రాబోయే రెండు, మూడు రోజుల్లో కూడా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
గురువారం ఉదయం 8 గంటల వరకు మెదక్ జిల్లాలోని చేగుంటలో అత్యధికంగా 227.5 మి.మీ. వర్షపాతం, రంగారెడ్డి జిల్లాలోని తట్టి అన్నారంలో 216 మి.మీ., నాగోల్ పరిధిలోని బండ్లగూడలో 212.7 మి.మీ. వర్షపాతం నమోదైంది.
ఇకపోతే, జూన్ 1వ తేదీ నుంచి 15వ తేదీ మధ్య రాష్ట్రంలో 369.7 మి.మీ. వర్షపాతం నమోదు కాగా, ఈ సమయంలో సాధారణ వర్షపాతం 236.33 మి.మీ. మాత్రమే. 17 జిల్లాల్లో రికార్డు స్థాయిలో 60 శాతం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. మరో 13 జిల్లాల్లో 20 నుంచి 59 శాతం వరకు వర్షపాతం నమోదైంది. మూడు జిల్లాల్లో మాత్రం సాధారణంగానే నమోదైంది.