ఎస్ఆర్ నగర్ పోలీస్ ఠాణా పరిధిలో విద్యార్థిని అదృశ్యం

గురువారం, 30 సెప్టెంబరు 2021 (11:27 IST)
హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ విద్యార్థిని ఉన్నట్టుండి అదృశ్యమైంది. ప్రభుత్వ పాఠశాలకు వచ్చిన విద్యార్థిని ఒక్కసారిగా అదృశ్యం కావడంతో స్థానికంగా కలకలం రేపింది.
 
పోలీసుల సమాచారం మేరకు... యూసుఫ్‌గూడ స్టేట్‌ హోంలోని బాలసదనంలోని ప్రియ అనే బాలిక వెంగళరావునగర్‌లోని ప్రభుత్వ పాఠశాలలో 7వ తరగతి చదువుతోంది. 
 
బుధవారం ఉదయం స్కూలుకు వచ్చిన ప్రియ మధ్యాహ్న భోజన విరామసమయంలో కనిపించకుండా పోయింది. బాలిక ఆచూకీ కోసం వివిధ ప్రాంతాల్లో వెతికినా ఫలితం లేనందున పాఠశాల హెచ్‌ఎం ధనుంజయ్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు