అల్లుడే కదా అన్ని నమ్మి వెళ్లిన ఓ అత్త అత్యాచారానికి గురైంది. తెలంగాణా రాష్ట్రంలోని సిద్ధిపేట జిల్లాలో జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే, జిల్లాలోని దౌల్తాబాద్ మండలం గోవిందాపురం గ్రామానికి చెందిన ఓ మహిళకు యేడాది క్రితం భర్త చనిపోయాడు. ఆ తర్వాత తన కుమారుడితో కలిసి జీవిస్తూ కూలి పనులకు వెళ్తుండేది. ఇందులోభాగంగానే గురువారం ఇదే మండలం శేర్‌బందారం కూలి పని చేసేందుకు వెళ్లింది. పని పూర్తి కాగానే.. అదే గ్రామంలో అల్లుడు (కుమార్తె భర్త)కి ఫోన్ చేసి ఇంటికి తీసుకెళ్లాలని కోరింది.