లాక్డౌన్‌తో పాటు పలు కీలక అంశాలపై కేబినెట్‌లో చర్చ జరగనున్నట్లు సమాచారం. అయితే, ఇప్పటికే రాష్ట్రంలో కఠినంగా లాక్డౌన్ అమలువుతోంది. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే అన్ని కార్యకలాపాలకు అనుమతిచ్చారు. ఆ తర్వాత అత్యవసర సేవలు మినహా ఎలాంటి వాటికి అనుమతి లేదు.
ప్రస్తుతం 24 గంటల్లో 20 గంటలు లాక్డౌన్‌ను అమలు చేస్తున్నారు. జూన్ నెలలో కూడా లాక్డౌన్ అమలు చేస్తారా అన్న ప్రశ్న తెలంగాణ ప్రజల్లో ఉత్కంఠగా మారింది. లేక ఇదే పరిస్థితి ఉంటే మరిన్ని సడలింపులు ఇస్తారా అనే అంశంపై కేబినెట్ సమావేశం అనంతరం సమాచారం రానుంది. లాక్డౌన్పై స్పష్టత రావాలంటే మరో కొన్ని గంటలు వేచివుండాలి.