ఈ విద్యాసంవత్సరం నుంచే ఈ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్‌సీఈఆర్‌టీ), ప్రభుత్వ పరీక్షల విభాగం (ఎస్ఎస్‌సీ బోర్డు) అధికారులు కసరత్తుకు శ్రీకారం చుట్టారు.
కరోనా వైరస్ మహమ్మారి కారణంగా గత రెండేళ్ళుగా విద్యా రంగం తీవ్రంగా నష్టపోయిన విషయం తెల్సిందే. ముఖ్యంగా ఈ యేడాది ఏ ఒక్క పరీక్షను కూడా నిర్వహించలేని పరిస్థితి నెలకొంది. దీంతో సీబీఎస్ఈ యేడాదిలో రెండు బోర్డు పరీక్షలు నిర్వహించాలని భావించాలని నిర్ణయించగా, ఇదే విధానాన్ని తెలంగాణ సర్కారు అనుసరించనున్నారు.