ప్రభుత్వం తరఫున దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి స్వామి వారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ముందుగా బాలాలయం మండపంలో స్వామి వారిని హనుమంత వాహనంపై రామావతారంలో విహరింపజేశారు.
రాత్రి నిర్వహించనున్న కల్యాణం సదర్భంగా ముగ్గురు ఏసీపీలు, ముగ్గురు సీఐలు, 16 నంది ఎస్సైలు, 24 మంది ఎస్సైలు, 54 మంది హెడ్ కానిస్టేబుల్స్, మరో 24 మంది కానిస్టేబుల్స్‌తో బందోబస్తు ఏర్పాటు చేశారు.
దాదాపు 10వేల మంది తిలకించేలా గ్రౌండ్‌ను సిద్ధం చేశారు. వీవీఐపీ, వీఐపీల, మీడియా ప్రతినిధుల కోసం ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేశారు.