పాకిస్థాన్ హీరోయిన్ మీరా: ఆ సెక్స్ వీడియో నాదికాదు బాబోయ్!
మంగళవారం, 1 ఏప్రియల్ 2014 (16:26 IST)
పాకిస్థాన్ నటి మీరాను ఓ వీడియో వెంటాడుతోంది. ఎక్కడికెళ్లినా ఆ సెక్స్ వీడియోలో ఉన్నది మీరేనా అని అడుగుతుండటంతో.. ఆ బ్లూ ఫిలిం నాది కాదండి బాబోయ్ అని ఎంతో గట్టిగా చెబుతోంది. గతవారం రోజులుగా మీరా ఎంఎంఎస్ స్కాండల్ వీడియో ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. అయితే ఈ వీడియోలో మీరాతో వున్నది ఇంకెవరో కాదు, ఆమె భర్త నవీదే. అయితేనేం అది కాస్త వల్గర్‌గా వుండటంతో అదిప్పుడు టాక్ ఆఫ్ ది పాకిస్థాన్ అయి కూర్చుంది.
న్యూయార్క్‌లో ఒక ఎయిర్‌లైన్స్ సంస్థలో కెప్టెన్‌గా పనిచేస్తున్న నవీద్‌ని పెళ్లి చేసుకున్న మీరాకి గ్లామర్ పరంగా పాక్‌లో మాంచి ఫోలోయింగ్ వుంది. మీరా, నవీద్ రొమాన్స్ చేస్తున్న వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేయడంతో ఈ అమ్మడు బయటికి వచ్చి దీనిపై స్పందించక తప్పలేదు. స్థానికంగా ఓ ఛానల్ నిర్వహించిన లైవ్ షోలో పాల్గొన్న మీరా-నవీద్‌లు ఈ వీడియోలో వున్నది తాము కాదని కొట్టిపారేశారు.
ఈమధ్య కాలంలో టెక్నాలజీ బాగా పెరిగిపోయిందనీ, ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు చూపించడం ఇప్పుడు బాగా తేలికైన వ్యవహారం అయ్యిందని మీరా అభిప్రాయపడింది. ఎవరు తనని అనుమానించినా, అనుమానించకపోయినా ఆ వీడియోలో వున్నది మాత్రం తాము కాదని ఆమె స్పష్టం చేసింది. ఇది కూడా యానిమేటెడ్ వీడియోలాంటిదేనని వివరించింది. మరి దీన్ని నెటిజెన్లు ఎంతమేరకు నమ్ముతారో వేచిచూడాల్సిందే.