కరెంట్ తీగ నటీనటులు : మంచు మనోజ్, రకుల్ ప్రీత్ సింగ్, సన్ని లీయోన్, జగపతిబాబు, సుప్రీత్, తాగుబోతు రమేశ్, వెన్నెల కిషోర్, పృథ్వీ, తనికెళ్ల భరణి తదితరులు. నిర్మాత: మంచు విష్ణు, దర్శకత్వం: జి నాగేశ్వరరెడ్డి.
కరెంట్ తీగ విశ్లేషణ :
ఊరిపెద్ద కూతురు ఆవారాగా తిరిగేవాడ్ని ప్రేమించడం, పెండ్లి చేసుకోనేక్రమంలో వచ్చే ట్విస్టులే ఈ సినిమా కథ. ఇటువంటి కథలు తెలుగులో చాలా వచ్చాయి. తమిళంలో విజయవంతమైన సినిమాను తీసుకోవడం ఎందుకో అర్థంకాలేదు. తీసుకున్నా ఇక్కడి నేటివిటీని చూపించడంలో దర్శకుడు ఫెయిలయ్యాడు. ఏ సన్నివేశంలోనూ ఫీల్ కన్పించదు. ఎప్పుడో '6టీన్స్' అనే సినిమాతో వెలుగులోకి వచ్చిన దర్శకుడు జి. నాగేశ్వరరెడ్డి. ఆ తర్వాత ఆయనకు అంత హిట్ రాలేదు.
సంభాషణల పరంగా సన్నీ చేత సూక్తులు చెప్పిస్తాడు. ఆడది పెర్ఫ్యూమ్ కాదు. పెప్పర్ లాంటిది. ఐ లవ్ యు చెబితే.. పెప్పర్ పోయి అంటూ హీరోయిన్‌కు సూక్తి చెబుతుంది. దర్శకుడు మాత్రం ఆమెను డ్రీమ్సాంగ్లో బాగా యూజ్ చేసుకున్నాడు. కేవలం మార్కెట్ కోసం ఆమెను పెట్టినట్లుంది మినహా ఆ పాత్రలో ప్రత్యేకత ఏమీలేదు. జగపతిబాబు పాత్ర ఆయన గెటప్‌కు ఈ చిత్రం చేయాల్సింది కాదు.
చివర్లో బఫూన్‌గా తీసేశారు. సుప్రీత్ చేసినా సరిపోయేది. ఇది కూడా కేవలం బిజినెస్ కోసమే... చాలాచోట్ల లాజిక్కులు అందవు.. స్కూల్‌డ్రెస్‌లో కవిత వెళుతూ.. కాలేజీ అని తర్వాత మాట్లాడటం. చివర్లో స్కూల్‌డ్రెస్‌లో వుంటే అందాన్ని చూడలేదని హీరో చెప్పడం.. వంటివి కన్ఫ్యూజ్గా వుంటాయి. విలన్‌గా ఓ టీవీ నటుడ్ని, మరో బాలీవుడ్ నటుడ్ని పెట్టారు. అది కూడా కథకు ఏమాత్రం ఉపయోగపడవు.
ఒక సినిమా హిట్ కావాలంటే ప్రేమకథతోపాటు కాస్త మాస్ అంశాలు, కామెడీ వుంటే చాలు. ఈ పాలసీనే మంచు మనోజ్ తీసుకున్నాడు. ఓ సందర్భంలో ఇదే విషయాన్ని చెబుతాడు కూడా. హీరో అంటే నాలుగు ఫైట్లు, సాంగ్స్, బాడీని చూపించడం కాదు. కాస్త నటన కూడా వుండాలి. అది ఈ సినిమాలో మనోజ్‌కు మైనసే. టైటిల్ కూడా ఏమాత్రం సింక్ కాలేదు. ఏతావాతా ఈ సినిమా వుపయోగపడింది పృథ్వీ, వెన్నెలకిషోర్ వంటి నటులకే. కరెంట్ తీగను ముట్టుకుంటే మటాషే అంటాడు. నిజంగానే ప్రేక్షకుడికి విసుగుపుట్టిస్తుంది. ముట్టుకుంటే షాక్ కొడుతుంది.