Ice Cream 2 ఫస్ట్ లుక్: ఐస్ క్రీమ్ 3 తీస్తా: రామ్ గోపాల్ వర్మ

శనివారం, 23 ఆగస్టు 2014 (12:59 IST)
"ఐస్ క్రీమ్-2" ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యింది. ఈ సినిమాపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు. 'ఐస్ క్రీమ్ -2' చాలా ఫ్రెష్‌దన్నారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను సందర్భంగా తన మనస్సులోని మాటలను వెల్లడించారు. 
 
ఫస్ట్‌లుక్ అంటే.. ఇప్పటివరకూ ఒక్క స్టిల్‌ని విడుదల చేసేవారు. నేను మాత్రం దీనికి భిన్నంగా ఒకేసారి 20 ఫస్ట్‌లుక్స్‌ని విడుదల చేస్తున్నట్టు చెప్పారు. 
 
‘ఐస్‌క్రీమ్’ సిరీస్‌లో భాగంగా ఆయన ‘ఐస్‌క్రీమ్-2’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. జేడీ చక్రవర్తి, నందు, భూపాల్, సిద్ధు, ధన్‌రాజ్, నవీనా, శాలిని, గాయత్రి ప్రధాన తారాగణం. నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ. ఈ చిత్రం ప్రచార పోస్టర్లను తాజాగా హైదరాబాద్‌లో విడుదల చేశారు. 
 
ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ - "సెప్టెంబర్ 19న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నాం. దానికి ఓ నాలుగు రోజుల ముందు ‘ఐస్‌క్రీమ్-3’ ప్రారంభిస్తాం. ‘ఐస్‌క్రీమ్’ సిరీస్ నుంచి నెలకు ఓ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాం" అని రామ్ గోపాల్ వర్మ వెల్లడించారు. 

వెబ్దునియా పై చదవండి