తుపాను బాధితులకు 15 లక్షల విరాళం ప్రకటించిన సచిన్

శుక్రవారం, 17 అక్టోబరు 2014 (15:29 IST)
ఇటీవలే 'నీ జతగా నేనుండాలి' వంటి చిత్రంతో మంచి విజయం అందుకున్న హీరో సచిన్ జోషి తుఫాన్ బాధితుల్ని ఆదుకునేందుకు తనవంతు సాయం చేసేందుకు ముందుకొచ్చారు. తనను అమితంగా అభిమానించే తెలుగువారికి ఇలాంటి పరిస్థితి రావడం దురదృష్టకరం అన్నారు.
 
తుపాను రూపంలో వచ్చిన ఇలాంటి విపత్కర పరిస్థితిని మీడియాలో చూసి తట్టుకోలేకపోయానని ఆయన అన్నారు. హుదూద్ తుపాను బాధితుల సహాయార్థం 15 లక్షల విరాళాన్ని ఇస్తున్నట్టు ప్రకటించారు. ఉత్తారాంధ్ర ప్రాంతాలు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.

వెబ్దునియా పై చదవండి