త్వరలో సెక్స్ బాంబ్ షకీలా ఆత్మకథ

ఆదివారం, 25 సెప్టెంబరు 2011 (13:58 IST)
File
FILE
త్వరలో మలయాళ సెక్సీబాంబ్ షకీలా ఆత్మకథ రానుంది. ఈ విషయాన్నే స్వయంగా ఆమె వెల్లడించారు. ఈ ఆత్మకథను రాస్తే మాత్రం చిలనచిత్ర పరిశ్రమ పరువు నడిబజారులోకి రాకమానదని ఆమె నొక్కి చెప్పింది. తాను ఆత్మకథ కమర్షియల్ సెన్సేషన్ కోసం రాయడం లేదని, తన జీవితంలో ఉన్నదున్నట్టుగా రాయనున్నట్టు చెప్పింది.

దీనిపై షకీలా మాట్లాడుతూ.. నేను ప్రపంచానికి నా గురించి పూర్తి నిజాలు వెల్లడించాలని అనుకుంటున్నా. ఇలా వెల్లడించాలని భావించడం పట్ల నాకు బాధ లేదు. నా ఊహించని విధంగా నా సినీ జీవితం మలుపులు తిరిగింది. అయితే నేను కాన్ఫిడెంట్‌గా చెప్పగలను… నాలో మంచి నటి ఉన్నదనే విషయం. కానీ నిర్మాతలెవరూ ఎందుకనో ఆ విషయం పట్టించుకోలేదు. నేను అప్పుడప్పుడూ మళయాళంలో మంచి క్యారెక్టర్స్ వేసినా నా ఇమేజ్ దాన్ని దెబ్బతీసిందన్నారు.

అయితే తెలుగు దర్శకుడు తేజ నాకు మంచి పాత్ర ఇచ్చి మెచ్చుకున్నారు. ఆయనకు కృతజ్ఞతలు. నా పర్శనల్ లైఫ్ గురించి చెప్పాలంటే నాకో బాయ్ ప్రెండ్ ఉన్నాడు. అతనితో నేను ప్రతీ విషయం షేర్ చేసుకుంటాను. ఇక షకీలాగా నేను ఏనాడు ఆనందం అంటే ఎరగలేదని చెప్పుకొచ్చింది. అన్ని విషయాలను ఆత్మకథలో వివరిస్తానని చెప్పింది.

వెబ్దునియా పై చదవండి