మరోవైపు మెగాస్టార్ చిరంజీవి చిత్రాన్ని ఇప్పటికే పలువురు రజినీకాంత్ చిత్రం కబాలితో పోటీపెడుతున్నారు. కబాలి చిత్రం ఇప్పటికే రూ. 600 కోట్లు వసూలు చేసి బాహుబలిని బీట్ చేసిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపధ్యంలో చిరంజీవి 150వ చిత్రం కబాలిని బీట్ చేయాలన్న పట్టుదలతో ప్రతి సన్నివేశాన్ని చాలా పగడ్బందీగా చేస్తున్నట్లు సమాచారం.