తెలుగు సీనియర్ నటుడు, డైలాగ్ కింగ్ మోహన్ బాబుకు మరో అరుదైన గౌరవం లభించనుంది. చెన్నైలోని ఎంజీఆర్ విశ్వవిద్యాలయం ఆయనకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయనుంది. ఈ విషయాన్ని ప్రముఖ హీరో, మోహన్ బాబు తనయుడు మంచు మనోజ్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించాడు.
కాగా, సినీ నటుడిగా, నిర్మాతగా, రాజకీయవేత్తగా మోహన్ బాబు తనదైన ముద్ర వేశారు. సుమారు 560 చిత్రాల్లో నటించిన ఆయన, టీడీపీ తరపున గతంలో రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. 2007లో ‘పద్మశ్రీ’ పురస్కారంతో మోహన్ బాబును భారత ప్రభుత్వం గౌరవించిన విషయం తెల్సిందే.