నిర్మలా కాన్వెంట్ కలెక్షన్స్.. నాగార్జునకు ఒకవిధంగా అవమానకరమేనా?

మంగళవారం, 20 సెప్టెంబరు 2016 (15:36 IST)
హీరో శ్రీ‌కాంత్ త‌న‌యుడు రోష‌న్ హీరోగా తెర‌గ్రేటం చేసిన సినిమా నిర్మ‌లా కాన్వెంట్. కింగ్ నాగార్జున కీల‌క పాత్ర‌లో న‌టిస్తూ నిర్మించిన ఈ సినిమా కలెక్షన్ల పరంగా దూసుకుపోతోంది. రిలీజైన మూడు రోజులకే రెండు తెలుగు రాష్ట్రాలలో కేవలం రెండు కోట్లకు పైగా వసూళ్లను కొల్లగొట్టింది. ఐతే వసూళ్ల పరంగా ఈ చిత్రం నాగార్జునకు కలిసిరాలేదని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. 
 
ఈ కలెక్షన్లు నాగ్‌కు ఒకవిధంగా అవమానకరమేనని సినీ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే నాగ్ వంటి టాప్ హీరో ఈ చిత్రంలో హీరో కాకపోయినప్పటికీ సెకండాఫ్‌లో పూర్తిగా కనిపిస్తాడు. కాబట్టి వసూళ్లు మరీ ఇంత నాసిరకంగా ఉంటే అవమానకరమేగా ! ఎన్నో సంచలన విజయాలను అందుకున్న నాగార్జున నిర్మలా కాన్వెంట్‌తో కొంత ఇబ్బందే పడుతున్నాడు. దీంతో ఈ సినిమాని చూసిన నాగార్జున అభిమానులు నాగార్జున ఈ సినిమాలో ఎందుకు నటించాడోనని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
 

వెబ్దునియా పై చదవండి