అంతా బాగుంది... రూ.3 కోట్లిస్తే ఓకె... నయనతార... అంత సీనుందా...?

శుక్రవారం, 5 ఫిబ్రవరి 2016 (16:51 IST)
ఈమధ్య నయనతార రూ.3 కోట్ల రెమ్యునరేషన్‌ అడిగిందని, దాంతో దర్శకుడు అవాక్కయ్యాడని తెలిసింది. దర్శకుడు సుందర్‌ సి.. చంద్రకళ తర్వాత కళావతి చిత్రం తీశాడు. మూడో ప్రయత్నంగా మరో సినిమాను నయనతారను అడిగాడట. అందుకు కథ కూడా చెప్పాక.. అంతా బాగుంది.. 3 కోట్లు ఇస్తేగానీ చేయనని చెప్పడంతో.. సుందర్‌ ఆశ్చర్యపోయినట్లు తెలుస్తోంది. 
 
ఇందుకు కారణం వుందనీ దెయ్యం సినిమాలు.. గర్భిణీలుగా చేయాల్సి రావడంతో.. రేటు పెంచినట్లు సమాచారం. మరోవైపు చూసుకుంటే.. తమిళ స్టార్‌ విక్రమ్‌తో ఆమె నటించనుంది. ఇరుముగన్‌ అనే పేరుతో రానున్న ఈ చిత్రంలో ఆమె సీక్రెట్‌ ఏజెంట్‌గా నటిస్తోంది. ఈ చిత్రం తన కెరీర్‌కు ఎంతో ముఖ్యమనీ.. ఇలాంటి పాత్రలు నటించేందుకు రెమ్యునరేషన్‌ తగ్గించినా పర్వాలేదుకానీ.. దెయ్యం, భూతం, పిశాచి వంటి కథల్లో ఎంత ఇచ్చినా చేయడం వేస్ట్‌ అనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

వెబ్దునియా పై చదవండి