విశాల్ క్రేజీ ప్రాజెక్టు సండకోళి2 (పందెంకోడి)లో.. విశాల్ లవర్ వరలక్ష్మీ కూడా నటించబోతున్నట్లు కోలీవుడ్‌లో జోరుగా ప్రచారం సాగుతోంది. చెన్నైలోనే మదురై తరహా భారీ సెట్ నిర్మించి తొలి షెడ్యూల్ చిత్రీకరణ జరుపుతున్నారు. ఇందులో విశాల్‌కు జోడీగా కీర్తి సురేష్‌ను హీరోయిన్‌గా ఎంపిక సంగతి తెలిసిందే. తాజాగా ఈ యూనిట్‌లో మరో హీరోయిన్ కూడా చేరింది. కథలోని ఓ కీలక పాత్రకు వరలక్ష్మి శరత్‌కుమార్‌ను ఎంపిక చేశారు.
ఇక పందెంకోడి తొలి భాగంలో నటించిన సీనియర్ నటుడు రాజ్‌కిరణ్ సీక్వెల్‌లోనూ కీలక పాత్ర పోషిస్తున్నారు. తమిళ, తెలుగు భాషల్లో రూపొందుతున్న ఈ సినిమా విశాల్ కెరీర్‌లో మరో హిట్‌ను ఖాతాలో వేసుకుంటుందని సినీ పండితులు అంటున్నారు.