గులాబి, సింధూరం, అంతఃపురం, ఖడ్గం, మురారి, గోవిందుడు అందరివాడే... చిత్రాల దర్శకుడు కృష్ణవంశీ.. ఈసారి.. అనుష్క ప్రధాన పాత్రతో చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. హార్రర్ నేపథ్యంలో ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమాకి సంబందించిన కథని ప్రిపేర్ చేసే పనిలో వున్నారు. ఇటీవలే అనుష్క ఫైనల్ స్క్రిప్ట్ విని కృష్ణవంశీ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలిసింది.
అనుష్కతో పాటు ఐదుమంది హీరోలు కూడా కనిపిస్తారని, దాని కోసం సెలక్షన్ కూడా నిర్వహిస్తున్నారని తెలుస్తోంది. కాగా, ఈ చిత్రానికి 'రుద్రాక్ష' అనే టైటిల్‌ని కూడా పెట్టనున్నట్లు తెలిసింది. కానీ అదే టైటిల్‌తో మరొకరు సినిమా తీస్తున్నట్లు ఇటీవలే ప్రకటించారు.