ఎనిమిది దశాబ్దాలుగా విజయవాడలో ప్రఖ్యాతి గాంచిన బాబాయ్ హోటల్‌ని మణికొండకి తీసుకురావడం సంతోషంగా ఉందని, అద్భుతమైన వంటకాలని చక్కటి శుచీశుభ్రతలతో అందిస్తున్నామని హోటల్ నిర్వాహకులు తెలిపారు. ఒక్కసారి రుచి చూసిన వాళ్లు పర్మినెంట్ కస్టమర్లుగా మారుతారు అన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత సుధాకర్ రెడ్డి, డైరెక్టర్ వెంకీ కుడుముల, రామ జోగయ్య శాస్త్రి, రచయిత దర్శకుడు వక్కంతం వంశీ, నిర్మాత ఠాగూర్ మధు తదితరులు పాల్గొని బెస్ట్ విషెస్ తెలిపారు.