టాలీవుడ్ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ పైన సెగలు పుట్టిస్తున్న శ్రీరెడ్డి తాజాగా ఫిదా సక్సెస్ డైరెక్టర్ శేఖర్ కమ్ములపై సంచలన ఆరోపణలు చేసింది. గత కొన్ని రోజులుగా నటీమణులపై లైంగిక వేధింపులు జరుగుతున్నాయంటూ పలు టీవీ ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తూ గడగడలాడిస్తోంది. తాజాగా ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ములపై ఆమె చేసిన తీవ్ర ఆరోపణలను చూస్తుంటే టాలీవుడ్ ఇండస్ట్రీ ఇమేజ్ ఇలానే వుందా అనే ఆశ్చర్యం కలుగకమానదు.
ఆమె ఫేస్‌బుక్‌లో చేసిన ఆరోపణలు ఇలా వున్నాయి... 'పెద్ద డైరెక్టర్ అని పొగరు. అబద్ధాలు చెప్పడంలో దిట్ట. తెలుగు అమ్మాయిలంటే పక్కలోకి తప్ప ఎందుకూ పనికిరారని ప్రగాఢ విశ్వాసం. ప్రామిస్‌లను బ్రేక్ చేయడంలో వీరి తర్వాతే ఎవరైనా. బక్కపీచు సోగ్గాడు. ఊదితే ఎగిరిపోయే ఇతనికి భయం, బలం రెండూ ఎక్కువే. టెక్నికల్‌గా దొరక్కుండా టెక్నాలజీని బాగా వాడాడు.