బాహుబలి సినిమాతో మంచి సక్సెస్ కొట్టిన ప్రభాస్ ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. నెల రోజుల పాటు బాహుబలి రిలీజ్ అనంతరం ప్రభాస్ బ్రేక్ తీసుకున్నారు. జూన్ 5న హైదరాబాద్‌కి వచ్చే ప్రభాస్.. సాహో టీమ్‌తో కలవనున్నాడని సమాచారం. ఇప్పటికే సాహో చిత్రం పూర్తి ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకోగా సెట్స్ పైకి వెళ్లేందుకు సిద్ధంగా ఉంది.
రన్ రాజా రన్ ఫేం సుజీత్ ఈ చిత్రాన్ని తెరకెక్కించనుండగా, యువి క్రియేషన్స్ బేనర్ పై 150 కోట్లతో సాహో రూపొందనుంది. ఈ మధ్య విడుదలైన సాహో టీజర్ మూవీపై భారీ అంచనాలు పెంచింది. చిత్రంలో కథానాయికగా ఎవరు నటిస్తారు అనే దానిపై క్లారిటీ రాలేదు. దిశాపటానీకి సాహో టీమ్ ఆఫర్ ఇచ్చిందట. ఇప్పటికే ఆమె సినిమాలు హిట్ కాకపోయినా, ''సాహో" దర్శకనిర్మాతలు మాత్రం దిశాపటానిని పట్టించుకుని ప్రభాస్ పక్కన నటించే ఛాన్స్ ఇచ్చారు.